తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్
జీవిత విశేషాలతో ‘ఒడవని ముచ్చట్లు’
లండన్‌లో పుస్తకావిష్కరణ ఆవిష్కరణ
లండన్,ఆగస్టు21(జనంసాక్షి):
తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ ఫౌండర్, మెంబర్ గంట వేణుగోపాల్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవిత విశేషాలు, అనుభవాలపై కొంపల్లి వెంకట్ రచించిన ఒడవని ముచ్చట్లు పుస్తకాన్ని వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యంలో ఈ పుస్తకం ఒక దార్శనికతలాగా పనిచేస్తుందన్నారు. సాహితీ ఉద్యమానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ సాహిత్యం ఎంతగానో తోడ్పడు తుందన్నారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ మహిళా ప్రతినిధి పవిత్రరెడ్డి మూట్లాడుతూ పుస్తకం తెలంగాణ ప్రజానికానికి స్పూర్తిదా యకం అన్నారు. జీవిత చరమాంకం వరకు తెలంగాణ సాధన కొరకు అంకితం చేసిన మహ నీయుడు జయశంకర్ అని తెలిపారు. మరో ప్రతినిధి అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఆయన జీవితం తెలంగాణ సాధన కొరకు ఆయన చేసిన సేవలు గొప్పవని, తెలంగాణ సాధనే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ప్రతిని ధులు మనిపులి, నాగేశ్ కె, చందుగౌడ్, వెంకట్‌రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.