రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఒకేసారి ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో సోదాల కొనసాగుతున్నాయి దాంతో కలెక్టరేట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది క్షేత్రస్థాయి అధికారులు మొదలుకొని ఐఏఎస్ అధికారుల వరకు పట్టుబడుతుండడంతో అధికారులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఏడి సర్వే శ్రీనివాస్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోని ల్యాండ్ సర్వే కార్యాలయంలో సోదాలు కొనసాగుతుండగా గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్ ఆయన ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాదు, రంగారెడ్డి, బాలానగర్, ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ల్యాండ్ రికార్డ్స్ ఎడీ గా పెద్ద ఎత్తున అక్రమస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి మహబూబ్ నగర్ లో రైస్ మీల్ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు పలుచోట్ల షేల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయదుర్గం మై హోం బుజలో సోదాలు కొనసాగుతున్నాయి రంగారెడ్డి కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులకు ఈమధ్యకాలంలోనే అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సైతం 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏడి సర్వేయార్ శ్రీనివాస్ పై సోదాలు నిర్వహిస్తున్నారు ఆయనకు సంబందించి పెద్ద ఏత్తున అక్రమ ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.