తెలంగాణ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: డీఎల్
హైదరాబాద్, (జనంసాక్షి): తెలంగాణపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి డీఎల్ అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తామని ఎవరు చెప్పారని, కొందరు అలా వూహించుకుంటున్నారని ఆయన అన్నారు.