తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ అయింది. తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇవాళ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 30న జరుగబోయే తెలంగాణ మార్చ్‌పై చర్చించినట్టు సమాచారం.