తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి రాయికోటి నర్సిములు కు ఘన సన్మానం
ఝరాసంగం సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి గా ఎన్నికైన రాయికోటి నర్సిములుకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, టిఆర్ ఎస్ కొల్లూరు గ్రామ ఉపాధ్యక్షుడు చింతలగట్టు శివురాజ్ ఆధ్వర్యంలో ఈదులపల్లి, ఝరాసంగం లో వేరు వేరుగా ఘనంగా సన్మానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెరాస అధ్యక్షుడు రాచయ్య స్వామి మాట్లాడుతూ జర్నలిస్ట్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి గా ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరమ్ మండల అధ్యక్షుడు బొగ్గుల జాగదీశ్వర్, ఈదుల పల్లి సర్పంచ్ బస్వరాజు పాటిల్, కొల్లూరు సర్పంచ్ బస్వరాజు పాటిల్, ఎంపీటీసీ రాజు కుమార్, డాక్టర్ శ్రీకాంత్, ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షుడు ప్రకాష్ జర్నలిస్ట్ చందు ఉప సర్పంచ్ యదుల్, నాయకులు శమన్న, వంశీ దేవదాస్, సురేష్ వసంత్, ఈదుల పల్లి గ్రామ పెద్దలు నగేష్ పాటిల్ పాండు, సంగమేశ్వర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.