తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు అందవా ?

ఆ మధ్య మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ వ స్తే మాకు నీళ్లు రావని తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత వరకు సత్యమని విశ్లేషిస్తే.. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం, అసత్యం. పైన ప్రాజెక్టులు కడితే కిందికి నీళ్లు రాకపొతే, మన పైన (ఆంధ్ర రాష్ట్రంపై) మహరాష్ట్ర, కర్ణాటకలున్నాయి. మరి కృష్ణా, గోదావరి నదుల్లో మన రాష్ట్రంలోకి ప్రవహించకుండా ఉండాలి. అలా జరుగుతోందా ? ముమ్మాటికీ లేదు. జేసీ వ్యాఖ్యలు కేవలం ‘తెలంగాణ’ అవతరణాన్ని అడ్డుకోవడానికి, సీమాంధ్రలోని సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రచారం మాత్రమే. అంతర్‌ రాష్ట్ర నదులపైన ఒడంబడికలుంటాయి. అవగాహన పత్రాలుంటాయి. టిబ్యునల్‌ ఆదేశాలుం టాయి. కట్టుదాటి ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవడానికి కోర్టులుంటాయి. ఇష్టారా జ్యంగా ప్రవర్తించడానికి ఇదేమన్న నియంతృత్వ పరిపాలనా ? తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ కలిస్తే నే ఆంధ్రప్రదేశ్‌.

ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన నది కృష్ణానది. కోస్తాంధ్ర, తెలం గాణకు సంబంధించి గోదావరిపైన ప్రధానమైన ప్రాజెక్టులు జూరాల, శ్రీశై లం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీ. ఈ నాలుగు అమలులో ఉన్నవి. కృష్ణానదికి ముఖ్యమైన ఉప నది తుంగభద్రపైన తుంగభద్ర ప్రాజెక్టు (కర్ణాటక లో ఉన్నది), దిగువన రాజోలిబండ ఆనకట్ట (ఎడమగట్టు కర్ణాటకలో కుడిగ ట్టు ఆంధ్రప్రదేశ్‌లో), దా ని కింద సుంకేసుల ఆనకట్ట (ఇప్పుడు బ్యారేజ్‌) ఉ న్నాయి. గోదావరి విషయానికి వస్తే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, చిట్ట చివరన ధవళేెశ్వరం (సర్‌ ఆర్థర్‌ కా టన్‌ బార్యెజ్‌) ఉన్నాయి. ఇటీవల నాగార్జునసాగర్‌ జలాశయం నీటిని ఉపయోగించుకుని కొంత మేర కు ఇంకా నిర్మాణం పూర్తి కాని ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు ఉంది.

ఇది ఎత్తిపోతలు మగావిటీ కాలువ (బాగా వరదలు వచ్చినప్పడు) ప్రాజె క్టు, వీటికి అదనంగా జూరా లపైన ఆధారపడ్డ భీమా, నెట్టంపాడు, శ్రీశైలం పైన ఆధారపడ్డ  కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, వెలిగొండ ఎస్‌ ఆర్‌బీసీ, హంద్రీనీ వా, గాలేరు, నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు, వీటి అనుబంధ రిజర్వాయర్‌ కాలువ ప్రాజెక్టులు. అలాగే గోదావరి నదికి సంబంధించిన శ్రీరాంసాగర్‌ ద్వి తీయ దశ, వరద కాలువ, ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, రాజీవ్‌ సాగర్‌, ఇందిరాసాగర్‌, ఎత్తిపోత పథకాలు, కంతనపల్లి, దుమ్ముగూడెం, నా గార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ ప్రాజె క్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలవరం నిర్మాణంలో ఉన్నా, సుప్రీం కోర్టు అంతిమ తీర్పుపై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. పోలవరం రాదేమోనని చేపట్టిన పుష్కరం, తాటిపూడి, వెంకటనగరం పంపింగులు పాక్షికంగా అమల్లో ఉన్నాయి.

ఇక గమనించవలసిన విషయమేమంటే అంతర్రాష్ట్ర నదులే కాదు, అంత ర్‌ దేశాల నదులపైన, ఆ యా దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాల మేరకు వాటి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఒడంబడికలు ఉల్లంఘించి పై దేశాలు గానీ, రాష్ట్రాలు గానీ తమ ఇష్టం వచ్చినట్లు జలాశయాలు నింపుకుంటే కిం ది దేశాలకు, రాష్ట్రాలకు నీళ్లు రావు. అందుకే, అలాంటి పరిస్థ్థితి ఉత్పన్నం కాకుండా అంతర్‌ దేశ, రాష్ట్ర నదుల నిర్వహణకు చట్టబద్ధమైన కంట్రోల్‌ బో ర్డులుంటాయి. ఉదాహరణకు మనదేశంలో సట్లేజ్‌, బియాస్‌, రావి నదులకు నిర్వహణ కోసం భాక్రా-బియాస్‌ కంట్రోల్‌ బోర్డు ఏర్పాటైంది. ఏదైనా ఒక ప్రాజెక్టు రెండు లేక అంతకు మించి రాష్ట్రాలు లబ్ధి పొందుతూంటే విధిగా రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆధ్వర్యంలో బో ర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రాల కే టాయింపుల ఆధారంగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం, సక్రమంగా నీరు ఆయా రాష్ట్రాల కు చేరేట్లు చూసే బాధ్యత ఆ కంట్రోల్‌ బోర్డుది.

ఉదాహరణకు తుంగభద్ర ప్రాజెక్టుతో అటు కర్ణాటకకు, ఇటు ఆంధ్రప్రదే శ్‌కు నీరు సరఫరా అవుతుంది. తుంగభద్ర కంటోల్‌ బోర్డు నీటి బట్వాడా భాధ్యతలను చేపట్టింది. ఈ బోర్డును కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. కేం ద్ర జల సంఘం ఛీప్‌ ఇంజినీర్‌ అధ్యక్షులుగా కర్ణాటక, అంధ్రప్రదేశ్‌ ప్రతి ని ధులు సభ్యులుగా ఈ బోర్డు పనిచేస్తున్నది.

పంజాబ్‌ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ 1966లోని సెక్ష న్‌ 79 అనుసరించి ఏ ర్పాటైన భాక్రా బియాస్‌ మేన ేజ్‌మేంట్‌ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీ ర్‌, చండీగఢ్‌, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ ప్రతినిధు లు సభ్యులుగా వ్యవహరిస్తారు. సట్లేజ్‌, రవి, బియాస్‌, నదుల వినియాగంతోపాటు భాక్రానంగల్‌, బియాస్‌ ప్రాజెక్టులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ బట్వాడా విషయాలపై బోర్డు చర్చించి నిర్ణయాలు చేస్తుంది. ఇదే విదంగా మన దేశంలో అనేక కంట్రోల్‌ బోర్డు లు, అథారిటీలు అంతర్‌రాష్ట్ర నదీ జలాల బట్వాడా అంశాలు అమలు విషయమై ఏర్పాటయ్యా యి. నదీ జలాలపై నెలకొనే తగాదాల పరిష్కారం నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం ప్రకారం కేంద్రం జోక్యం చేసుకుని, అవసరమైన పక్షంలో ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడంలో దోహద పడుతుంది. కృష్ణా నదీ జలాల కేటాయింపుల నిమిత్తం లోగడ బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏర్పడి తమ ఆదేశాలను వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఏర్పా టైంది. అంతిమ తీర్పు ఇంకా రావాల్సి ఉంది.

అదే విధంగా గోదావరి జలాల వినియోగ విషయంలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ (ఇప్పటి ఛత్తీస్‌గఢ్‌) ఒరిస్సా రాష్ట్రాలు పరస్ప రంచేసుకున్న ఒడంబడికల ఆధారంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ తమ అవార్డును ప్రకటించింది. ట్రిబ్యునల్‌ అవార్డు అంటే సుప్రీం కోర్టు డిక్రీతో స మానం. దానిపైన ఎలాంటి అప్పీలు కూడా ఉండదు. అయితే, ఏ రాష్ట్రమైనా ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారంగా నడుచుకోకుండా, ఆదేశాలను ఉల్లంఘిస్తే సు ప్రీం కోర్డు తలుపు తట్టవచ్చు. ఉదాహరణకు ఆలమట్టి విషయంలో మన రా ష్ట్రం కర్నాటకపై, మిగులు జలాల ఆధారంగా మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కర్నాటక సుప్రీం కోర్టు తలుపు తట్టడం, మధ్యంతర ఉత్తర్వులు వెలువరించి, ఈ సమస్యను తేల్చాలని సుప్రీం కోర్డు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను కోరింది.

ఇదే విధంగా, మహారాష్ట్ర నిర్మిస్తున్న, బాబ్లీ ప్రాజెక్టు, ఇతర కట్టడాలు శ్రీరాంసాగర్‌పై దుష్ప్రభావం చూపెట్టాయని మనం సుప్రీం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాము. ఆ కేసుపై అంతిమ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే అంతర్రాష్ట్ర నదుల నీటి కేటాయింపులు, కేటాయింపుల ప్ర కారం అమలు జరిగేట్టు చూడడం వగైరా విషయాల బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాట య్యే సంస్థలు నిర్వహిస్తాయి. ఉల్లంఘించిన సందర్భాల్లోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే శ్రీశైలం, నాగార్జున సాగర్‌, రాజోలిబండ కాలువ ప్రాజెక్టుల నిర్వహణ కు విధిగా కంట్రోల్‌ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రాజోలిబండపై కంట్రోల్‌ బోర్డు విషయంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇది వరకే నిర్ణయం తీసుకున్నదని తెలుసుకోవాలి. ఎందుకంటే, ఈ మూడు ప్రాజ ెక్టుల ద్వారా ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల కేటాయింపుల ఆధారంగా నీటి బట్వాడా జరుగుతుంది.

కేటాయింపులకు మించిగానీ, ఎక్కువ గానీ ఆయా రాష్ట్రాలకు నీటి బట్వా డా జరుగదు. ఒకవేళ ఉల్లంఘన జరిగితే కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతుం ది. ఇప్పుడు దేశంలో ఉన్న వ్యవస్థ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా కేవ లం ఒక రాష్ట్రానికి నీరందిస్తున్న ప్రాజెక్టుపైన అజమాయిషీ కంట్రోల్‌ బోర్డు ఆధీనంలో లేదు. కాని, అంతర్రాష్ట్ర నదులపైన వెలిసిన ప్రాజెక్టుల విష యం లో ఆయా రాష్ట్రాలు కేవలం తమ అజమాయిషీలో ఉండడం వల్ల ఒడంబడిక లు, ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఫిర్యాదులు ఎక్కువవుతున్న పరిస్థితు లను గమనించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మొత్తం బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టు ల నిర్వహణ బాధ్యత కోసం చట్టబద్ధమైన సంస్థ ఉండాలని ప్రతిపాదించింది.

ట్రిబ్యునల్‌ ఆదేశాలు అంతిమంగా వెలువడితే కృష్ణా నదిలోని అన్ని ప్రా జెక్టులపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటయయ్యే చట్టబద్ధమై న సంస్థదే అవుతుంది. చాలా సమస్యలకు ఇది పరిష్కారమని నిపుణులు భా విస్తున్నారు. మన రాష్ట్రంలో నీటి విషయంలో ఏర్పడ్డ అనేక అవకతవకలు, దో పిడి, అన్యాయాలు, దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని అంధ్రప్రదేశ్‌ సమైక్యం గా ఉన్నా, లేక తెలంగా ణ ఏర్పడ్డ రాష్ట్రంలోని కృష్ణ్ణా, గోదావరి నదుల పైన అన్ని ప్రాజెక్టుల కోసం చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ కూడా సిఫార్సు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, తెలంగాణ, సీమాంధ్ర ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో ఎవరికీ అ న్యాయం జరుగకుండా, నియమ నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్‌ ఆదేశాలను అనుసరించి అంతర్‌ జాతీయ న్యాయ సూత్రాలు, జాతీయ జల విధానం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణా, గోదావరి జలాలు సక్రమంగా రై తుల పొలాలకు అంది ఆయా రాష్ట్రాను సుభిక్షం చేస్తాయని ఆశిద్దాం.