తెలంగాణ సంపదంతా దోచుకున్నారు: హరీష్‌రావు

హైదరాబాద్‌: సమైక్య రాష్ట్రంలో నిళ్లు, ఉదోష్ట్ర్యగాలు, భూములు, తలలెంగాణ సంపదంతా సీమాంధ్ర నేతలు దోచుకున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు చెందిన పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత మరో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆ పారర్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణణపై బాబు స్పష్టమైన వైఖరి ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. దేవెందర్‌గైడ్‌ను పార్టీ నుంచి బయటకు పంపించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. టీడీపీతో తెలంగాణ రాదన్న దేవెందర్‌గౌడ్‌ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన యూపీఎ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. యూపీఏ మోసం చేయడం వల్లే ప్రణబ్‌ముఖర్జీకి ఓటు వేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిపారు. తెలంగాణకు తాగడానికి నీళ్లు లేకున్నా కృష్ణా డెల్టాకు నీళ్లు ఎలా విడదల చేస్తారని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై చంద్రబాబు, జగన్‌ ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు. రహీమున్నీసా స్పూర్తితో పార్టీలోకి మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిపారు.