తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పులివర్తి
సైదాబాద్ (హైదరాబాద్) : తెలుగులో అత్యధికంగా ఆధ్యాత్మిక చింతనపై వ్యాసాలు రాసినందుకు సైదాబాద్‌లోని జయనగర్ కాలనీకి చెందిన రచయిత, కవి డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసే తెలుగు బుక్ రికార్డ్స్‌లో పేరు నమోదుతో పాటు విశిష్ట సత్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అధ్యక్షుడు రమణమూర్తి చేతులమీదుగా ఇటీవల జరిగిన కార్యక్రమంలో ధ్రువపత్రాన్ని అందుకున్నారు. గతంలో వండర్ రికార్గ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ప్లలో కూడా పులివర్తి పేరు నమోదైంది.