తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలల బోధనా సామర్థ్యం

తేలిపోయిన కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాల ల బోధనా సామర్థ్యంఇంటర్మీడియట్‌ విద్యాబోధ నలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో మిగతా రాష్ట్రాలను వెనక్కినెట్టి ఎన్నో సీట్లు పొందుతున్నాం అని గర్వంగా పేజీలకు పేజీలు ప్రకటనలు గుప్పించే మన కార్పొరేట్‌ కళాశాలల భండారం మొన్నటి ఇంటర్‌ రెండవ సంవత్సర భౌతిక శాస్త్రం పరీక్ష పత్రంపై వారి స్పందనతో భయటపడింది.

మూస ధోరణిలో బట్టీయం పట్టించే మన కళాశాలల అధ్యాపకులు ప్రశ్నాపత్రం విద్యార్థుల స్థాయికి మించి, పాఠ్యప్రణాళికను దాటి, అతి కఠినంగా ఘోరంగా తయారు చేసి బోర్డువారు క్షమించరాని తప్పు చేశారని గోలచే శాయి. నిజానికి పరీక్షా పత్రంలో కొంతమేర కొత్తదనం ఉన్న మాట నిజమే. గతంలో వచ్చిన ట్లు మూస ప్రశ్నలను కాదని విద్యార్థుల నిజమైన అవగాహనను తెలుసుకోవడానికి తగిన విధంగా ప్రశ్నాపత్రం రూపొందించడం జరిగింది. గత మూడు,నాలుగు సంవత్సరాల పరీక్షా పత్రాలను బట్టి పట్టించి వందకు వంద మార్కులు కొట్టేయా లనుకునే కార్పొరేట్‌ కళాశాలల ప్రయత్నాలకు ఈ ప్రశ్నాపత్రం గండికొట్టింది.

ప్రశ్నలను సూటిగా కాకుండా డొంక తిరుగుడుగా అడిగి విద్యార్థులను తికమకపెట్టి వారు మానసిక క్షోభను అనుభవించేలా చేశారని టీవీల ముందు గోల చేసిన కార్పొరేట్‌ అధ్యాప కులు లక్షల రూపాయల ఫీజులను తీసుకొని విద్యార్థులకు నేర్పినది ఏమిటి. అనే ప్రశ్న ఎవరయినా వారిని అడిగారా? గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయినారని మొసలి కన్నీరు కార్చే మీరు ఏ నాడయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులపట్ల కనీస ప్రేమ చూపారా? అలా అయితే ఈనాడు కార్పొరేట్‌ కళాశాలల్లో పని చేసే ఎంతో మంది ప్రభుత్వ అధ్యాపకులు గ్రామాలలో పని చేసి అక్కడి విద్యార్థులకు సేవలందించేవారు.

అలా కాకుండా ప్రభుత్వ మరియు గ్రామీణ కళాశాలల్లో చదివే ఉత్తమ విద్యార్థులను మభ్యపెట్టి, డబ్బులు ఎదురిచ్చి తమ కళాశాలల్లో చేర్పించుకొని వారి ర్యాంకులను తమ ర్యాం కులుగా చెప్పుకొనే కార్పొరేట్‌ ప్రబుద్ధులు ఈనా డు తమ ఊహలు తలకిందులు కాగానే సామా న్య, గ్రామీణ విద్యార్థులపై కపట ప్రేమ ఒలక బోస్తున్నారు.

నేటి విద్యాబోధన అంతా పైపై మెరు గులే అన్న మాట అందరికి తెలుసు. జాతీయ పోటీ పరీక్షలలో మన రాష్ట్రం నుంచి లక్షల మంది పోటీ పడితే వందల సంఖ్యలలో సీట్లు వస్తున్నాయి. ఈ పోటీ పరీక్షలలో వచ్చిన పది మంది విద్యార్థుల ఫొటోలతో ప్రకటనలు గుప్పిం చి సాధారణస్థాయి విద్యార్థులకు, ఆశలు చూపి లక్షల రూపాయలు ఫీజులు గుంజే కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు నిజాయితీగా తాము చేర్చుకోనే విద్యార్థులలో కనీసం పది శాతం మందికైనా, మన రాష్ట్ర ఎంసెట్‌లో కానీ, ఐఐటీ లేదా ఏఐఈఈలో కానీ సీట్లు ఇప్పించామని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? లక్షల మందిలో పదిమందికి సీట్లు వస్తే అది తమ గొప్పే అని చెప్పుకొనే కార్పొరేట్‌ సంస్థలు తమ కళాశాలలో చదువుకొని ఎందుకు పనికి రాకుండా పోయిన మిగతా లక్షల మంది గురించి వొక్కనాడయినా ఆలోచించాయా? కోచింగ్‌కు వచ్చి కూడా మొదటి రెండు ప్రయత్నాలకు సీటు రాకుండా మూడవ ప్రయత్నం చేసే వారిదగ్గర కూడా ఫీజులు వసూలు చేసేవారు, ఇప్పుడు అందరి చూపులు బోర్డ్‌ నుంచి ఎలా గ్రాస్‌ మార్కులు సంపాదించాలి. ఎన్నడూ లేనటువంటి సామాన్య విద్యార్థులపై లేని ప్రేమ ఒక్కసారిగా వీరికి ఎలా వచ్చిందో మన అందరం ఆలోచించాలి. ఈనాడు పరీక్షాపత్రం కఠినంగా వచ్చింది. బోనస్‌ మార్కులు లేదా గ్రేస్‌ మార్కులు కలపాలి లేకుంటే భూమి బద్దలు అవుతుంది, మేము కోర్టుకు వెళ్తాము అని గోల చేస్తున్నాయి. ఎందుకు? తమ దగ్గర లక్షల ఫీజులు కట్టి కనీస మార్కులు కూడా రాని విద్యార్థులు ఫీజులు వాపస్‌ ఇవ్వాలని ఏనాడైనా ఈ కార్పొరేట్‌ కాలేజీలు ఆలోచించాయా? మరి ఎందుకు ఈ ఆర్భాటా లు? ఈ తప్పుడు ప్రకటనలు.

తమ బోధనలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి బోర్డ్‌ మీద నిందలు వేసే మేధావులను ఎలా చూడాలో మీరే నిర్ణయిం చుకోండి. గ్రామీణ లేదా ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో చదివే దళిత,బలహీన వర్గాల వారికి ఎన్నడూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు రాలేదు రాకపో వచ్చు కూడా. ఎక్కడో ఒకటి అర మినహాయింపు ఉండవచ్చు. అసలు ప్రభుత్వ కళాశాలల్లో బోధన గురించి కాని అక్కడి బోధన సౌకర్యాల గురించి కాని ఏనాడైనా మన మేధావులు పట్టించుకు న్నారా? ప్రతి మండలంలో ఒక కళాశాల ఏర్పాటు చేశామని చెప్పుకొనే ప్రభుత్వం ఏనాడై నా అక్కడ అధ్యాపకులుగానీ, కనీస అవసరా లుగానీ ఉన్నాయా అని పరిశీలించారా? ఇక మన ప్రజాప్రతినిధులకు కాంట్రాక్ట్‌లపై ఉన్న ఇంట్రెస్ట్‌ బోధన విధానాలపై కానీ అక్కడి విద్యార్థులు స్థితిగతులపై కానీ ఉందా అన్నది కోటి డాలర్ల ప్రశ్న.

విద్యాహక్కు చట్టంతో దేశమంతా ఒకే విద్య విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంటే దానికి అనుగుణంగా మన పాఠ్యప్రణాళికను బోధనను మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ ప్రశ్నాపత్రం వల్ల విద్యార్థులు నష్టపోతే దానికి బాధ్యత ఎవరిదో ఒక్కసారైనా ఈ కళాశాలలో ఇన్నాళ్ళు బోధించిన మేధావులు, వీటికి కొమ్ముకాసే నాయకులుగానీ, వీటి పట్ల అవ్యాజ్యమైన ప్రేమ చూపే తల్లిదండ్రులు ఆలోచించారా? అసలు అలా ఆలోచించాలనే ఊహైనా వారికి తడుతుందా?

తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశించడం తప్పు కాదు. తమ కన్నా పైస్థాయికి ఎదగాలనుకోవడం తప్పుకాదు. కానీ దాని అనుగుణంగా వారు ఎన్నుకొనే మార్గమే తప్పు అనిపించడం లేదా? మన పిల్లలు ఎలాంటివారో వారిస్థాయి ఏమిటో మన కన్నా బయట ివారికే ఎక్కువ తెలుసా? అని ఏ తల్లి తండ్రయినా ఒక్కసారయినా ఆలోచించరా? ఎప్పుడూ మంచి కళాశాలలో మా పిల్లలను చేర్పించాలి. ఎంత ఎక్కువ ఫీజులు ఉంటే అంత మంచి కాలేజీ అని, అదే తమ ప్రిస్టజికి (దర్పానికి) నిదర్శనంగా భావించే వారు నిజమైన విద్య, విషయ పరిజ్ఞానం, అవగాహన వస్తుందో రాదో ఎన్నడైనా ఆలోచించారా?.

కార్పొరేట్‌ కళాశాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతుందని మీడియా నెత్తినో రుకొట్టుకున్నా పట్టించుకొనే వారే రువయ్యారు. కనీసం ఇప్పుడైనా నేటి కార్పొరేట్‌ కాలేజీలలో జరుగుతున్నదేమిటో గ్రహించాలి. అక్కడ విద్యా ర్థులు ఎంతటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారో మనసున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచిం చండి. ఒక్క ఇంజినీరింగ ్‌చదివితేనో లేక డాక్టర్‌ అయితేనో జీవితం గెలిచినట్టు కాదు.

ఈనాడు ఎన్నో సర్విసింగ్‌ రంగాలు ఎంతో మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు కనుమరుగవుతున్న ఈనాడు ఇంజినీర్కన్నా ఎక్కువగా కనీస అవగాహన కల్గిన డిగ్రీ విద్యార్థి కూడా సంపాది స్తున్నాడు. పదవ తరగతి కనీస మార్కులతో పాసైన వారు అనిమేషన్‌ రంగంలో తమ ప్రతిబ óతో లక్షలు సంపాదిస్తున్నారు.ఇదంతా మన చర్చ కు ఒక పక్కే. మరో పక్క రేపు ఫలితాలు వచ్చిన తరువాత కాని ,మళ్లీ ఇప్పుడు విద్యార్థులు రాయ బోయే ఎంసెట్‌ లేదా ఇతర పోటీ పరీక్షలలో ఈనాటి అసంతృప్తి, అభద్రతా భావన లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధ్యాపకులతోపాటు తల్లిదండ్రులది కూడా. చెడు ఊహించడం మం చిది కాదు కాని ముందు జాగ్రత్తగా పడకుంటే మొదటికే మోసం రావచ్చు. ప్రతి సారి ఫలితాలు వచ్చిన మొదటి రెండు మూడు రోజులు పిల్లలను కనిపెట్టుకొని ఉండడం లేదా అంతకంటే ముందే వారిని మానసికంగా ఎలాం టి పరిస్థితినైనా తటుకొనేలా తయారు చేయడం మన బాధ్యత. మనం ఊహించినట్లు జరగాలని అందరం కోరుకొందాం. కాని అలా జరగనప్పు డు, జరిగిన దానిని తెలుసుకొని దానికి అనుగు ణంగా లేదా వచ్చిన ఫలితాలకు అనుగుణంగా మన ప్రణాళికలను మలుచుకొనే మనోధైర్యాన్ని మన పిల్లలు అలవరుచుకోనేలా తీర్చిదిద్దేలా కృషి చేయాలి.

గడిచిన పదిహేడు-పద్దెనిమిది సంవత్సరాల జీవితానికన్నా అనుభవాన్నిచ్చబోయే డెబ్బై-ఎనబై సంవత్సరాల జీవితం ఎంతో గొప్ప దనే భావన మన పిల్లల్లో కలిగించాలి. యవ్వన తొలినాళ్లలో ఉన్న యువకులు చిన్నపాటి ఓటమి ని కూడా భరించలేక పోవచ్చు. కాని వారిని తీర్చిదిద్దే మార్గదర్శకులుగా అధ్యాపకులు వారికీ తగిన ధైర్యాన్ని, పోటీ తత్వాన్ని, జీవితాన్ని గెలుచుకోనే మెళుకువలను కూడా నేర్పాలి.

పుస్తకంలో ఉన్నదీ చెప్పాం. గెస్‌ పేపర్‌ ఇచ్చాం. బోర్డ్‌ వారు మేము చెప్పినట్లు చేయలేదు అని నేరం వేరే ఒకరిపై నెట్టకుం డా,అధ్యాపకులుగా మనం మన బాధ్యతను ఎంత వరకు నేరవేర్చాం,ఇంకా ఎంత చేయాలి అని గుండె మీద చేయి వేసుకొని ప్రతి ఒక్క అధ్యా పకుడు ఆలోచించాలి.

రేపు మన వద్ద నేర్చుకున్న విద్యార్థి మన స్వార్థం వల్ల, అంటే మనకు పేరు తెచ్చే కొంత మందిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిగతా వారిని సమిధల్ల మార్చుకొంటే, ఎందుకు పనికిరాకుండా పోయినా లేదా అసాంఘిక శక్తులతో చేతులు కల్పినా లేదా తల్లిదండ్రులకు భారమైనా లేదా తల్లిదండ్రులకు శోకమే మిగిల్చినా దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఒక గురువుగా లేదా ఒక సంస్థ యజమానులుగా మనకు బాధ్యత ఉంటుందా ఉండదా? అని ఆలోచించారా? సమాజం నుండి కోట్లాది రూపాయలు గుంజుతూ అఖండమైన గౌరవాన్ని పొందుతున్న ఈ ఉన్నత వర్గం ఎనాడైన వల్ల ఈ సమాజానికి పొరపాటున నష్టం జర్గితే దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అని ఏనాడైనా, ఒక్క క్షణం ఆలోచించారా?

ప్రభుత్వ పరీక్ష విధానాన్ని విమర్శిం చడం కాదు ఇప్పుడు అధ్యాపకులుగా గాని కాలేజీ యాజమాన్యాలు కాని చేయాల్సింది. ఇన్నాళ్ళు తాము చేసిన తప్పుడు బోధనా పద్ధతులను ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి. ఎంత మందికి ర్యాంకులు వచ్చాయని కాకుండా ఎంతమంది విద్యార్థులను నిజమైన, బాధ్యతాయుతమైన పౌరు లుగా తయారు చేసామని ఆలోచించాలి.

తల్లిదండ్రులూ ఆలోచించండి :

మన పిల్లల స్థాయిని మనకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలవారు ఎవరు ఉండరు. నిజంగా మన పిల్లలు మిగతా అందరికన్నా ఎక్కువ సామర్థ్యం కలవారని మీరు భావిస్తే వారి ఆలోచనలను వారి ఇష్టఇష్టాలను కూడా అడిగి తెలుసుకొని అందుకు అనుగుణంగా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వండి. కాని ప్రకటనలకు మోసపోయి కాదు. అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించడం కాదు ఒక కొడుకుగా లేదా ఒక బిడ్డగా మీ భావి జీవితంలో మీకు తోడుగా ఉండే ఒక మనసున్నా మనిషిని తయారు చేసుకోండి. అతి ఎక్కువగా ఆశించి ఆశాభంగం చెంది జీవితాంతం బాధపడడం అవసరమా ? ఆలోచించండి.

– సిహెచ్‌.వి ప్రభాకర్‌రావు

సీనియర్‌ జర్నలిస్ట్‌