అంతర్ రాష్ట్ర మేకలు గొర్రెలు దొంగలించే ముఠా అరెస్ట్

వికారాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7 (జనం సాక్షి): వివిధ రాష్ట్రాల్లో మేకలను గొర్రెలను దొంగతనానికి పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసామని మరో తొమ్మిది మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వికారాబాద్ జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈనెల:7 న ఉదయం అందజా 2.00 గంటల నుండి 3.00 గంటల మధ్యలో చెన్ గోముల్ పోలీస్ అధికారులు మరియు సి‌సి‌ఎస్ పోలీస్ అధికారులు కలసి మన్నెగూడ చౌరస్తాలో వాహానాలు తనిఖీలు చేస్తుండగా నెంబర్ ప్లేట్ లేని రెండు స్కార్పియో వాహనాలు రాగ, వాటిని అపి తనికీ చేస్తుండగా అందులోఉన్న వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని పట్టుకొని విచారించినట్లు చెప్పారు. వారు పేర్లు ప్రభు మరియు కైలాష్ చౌహాన్ అని తెలిపినారు. వీరు చెంగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేకలు, గొర్రెలను దొంగతనం చేసుకోవడానికి వీలుగా ఉండే ప్రాంతాలను రెక్కి చేసుకోవడానికి వచ్చినాము అని విచారణ తెలియజేసినట్లుు చెప్పారు .ఇప్పటికే వికారాబాద్ జిల్లా లోని నవాబ్ పేట్ పియస్ పరిధిలోని పూల్ మామిడి గ్రామంలో, పరిగి పియస్ పరిధిలోని రూప్ ఖాన్ పేట్ గ్రామంలో, చన్ గోముల్ పియస్ పరిధిలోని ఎనికెపల్లి,గొంగుపల్లి, కంకల్ గ్రామాలలో, ధారూర్ పియస్ పరిధిలోని మైలారం గ్రామంలో, కుల్కచర్ల పియస్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ , వనపర్తి, నారాయణ పేట్, నాగర్ కర్నూల్ జిల్లాలలో మరియు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, బళ్ళారి, బిధర్, యాద్గిర్,కొప్పల్ మరియు బెంగళూరు జిల్లాల పరిధిలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. నేరస్థులను విచారించగ నేరస్థులు కర్ణాటక యాద్గీర్ జిల్లా కు చెందిన 1)ప్రభు 2)శేక్యా 3) చెన్నప్ప @చెన్న 4) మారుతి 5) రవి 6) ఖీము 7) దశరథ 8) సంజయ్ కుమార్ చౌహాన్ ఏలియాస్ టి‌బి 9) శంకర ఏలియస్ చొంగ్య 10) కైలాష్ చౌహాన్ 11) కందప్ప ఏలియాస్ ముదుకప్ప ఒక గ్యాంగ్ గా ఏర్పడి తాగుడుకు, జల్సాకు అలవాటు పడి దొంగతనం చేయడం తమ వృత్తిగా ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ పాత నేరస్థులే , వీరు ముందుగా దొంగతనం చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళి రెక్కి నిర్వహించి తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి 11 మంది నేరస్థులు 2 టీమ్ లుగా విడిపోయి రెండు స్కార్పియో వాహనాలు తీసుకొని వాటి నెంబర్ ప్లేట్ లు తీసివేసి, టెక్నికల్ గా కూడా ఎవరికి చిక్కకుండా జాగ్రతలు తీసుకొని రాత్రి సమయాలలో రెక్కి చేసుకున్నా ప్రాంతాలలోని మేకలను , గొర్రెలను దొంగతనం చేస్తారు అని ఒప్పుకోవడం జరిగింది. పైన పేర్కొన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో మేకల , గొర్రెల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగింది. నెంబర్ ప్లేట్ లు లేని స్కార్పియో వాహనాల గురించి తెల్సుకోగా 1) కే ఏ 32 ఎన్ 6607 2) కే ఏ 05 ఎం ఎఫ్ 3794 నెంబర్లు కల్గి ఉన్నాయని విచారణలో తెలిసింది. వీరు దొంగతనం చేసిన మేకలను,గొర్రెలను వెంటనే అమ్మకుండా తమ గ్రామాల పరిధిలోని అడివి ప్రాంతాలలో కోటలలో పెట్టి గొర్రెలను,మేకలను మేపుటకు పని మనుషులను పెట్టుకొని మార్కెట్ లు జరిగే రోజులలో ఇట్టి గొర్రెలను, మేకలను తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు.ఇట్టి దొంగతనాలకు పాల్పడిన ఏ1)ప్రభు మరియు ఏ10) కైలాష్ చౌహాన్లను నేరస్థులను అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన 9 మంది పరారీలో ఉన్నారు.నేరస్థుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారు
రెండు తెలుపు రంగు స్కార్పియో వాహనం నెంబర్ KA 32 N 6607.
2) తెలుపు రంగు స్కార్పియో వాహనాలు. (యాపిల్ ఫోన్, ఒప్పో2 సెల్ ఫోన్ లు,గొర్రెలు, మేకలు అమ్మిన 1,00,000 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు చెంగో ముల్ పి‌ఎస్ ఎస్‌ఐ యస్. మధుసూదన్ రెడ్డి, హెచ్ సీలు చెన్నయ్య గౌడ్, గోవిందప్ప, పి సి లు కృష్ణ రెడ్డి, అంజప్ప, రాఘవేంధర్ రెడ్డి, రామకృష్ణ లకు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.