బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

హైద్రాబాద్ : బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆయన పనిచేశారు.