తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ బందోబస్తును పర్యవేక్షించారు. నమాజ్‌ తర్వాత మక్కామసీదులో యౌముల్‌ ఖురాస్‌ పఠనం జరిగింది.