త్వరలో రైతుభరోసా నిధులు విడుదల చేస్తాం

సర్వే తరువాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తాం
` ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తాం
` ఆర్థికపరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా1నే ఉద్యోగులకు జీతాలు
` పెండిరగ్‌ బిల్లులూ మంజూరు చేస్తున్నాం
` కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది
` బీఆర్‌ఎస్‌ నేతల కనుసన్నల్లోనే లగచర్లదాడులు
` భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు
` ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారు
` ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు
` ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దు.
` సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి
` బైంసా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
బైంసా(జనంసాక్షి):త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లో రైతుల కోసం రూ.72 వేల కోట్ల నిధులు వెచ్చించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండిరగ్‌ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, పదేళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుందని, దాని వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నింటిని సరిదిద్దుకొంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అంతకముందు భైంసాలోని విశ్రాంతి భవనంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానిక సమస్యలపై అధికారులతో సవిూక్షించారు.ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కులగణన సర్వేకు సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాహుల్‌? గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణను రోల్‌? మోడల్‌?గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌ నేతల కనుసన్నల్లోనే లగచర్లదాడులు
నిర్మల్‌ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్‌ కలర్‌ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్‌ రే తీసినట్ట అంతా బయకు తీస్తదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టదని, గత ప్రభుత్వ నాయకుల్లా కాదు.. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనేది మా ప్రభుత్వ చిత్తశుద్ది అని ఆయన అన్నారు.సగం కట్టి వదిలేసిన ఇండ్లపై రివ్యూ చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు మంత్రి పొంగులేటి. జనవరి నెల నుంచి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండిరచిన ప్రతీ గింజ కొంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అంతేకాకుండా%ౌ% రైతుల కోసం అని కల్లాల బాట, మరో బాట అంటూ ఎవ్వరు పాదయాత్ర చేసి మోకాళ్లు అరగగొట్టుకోవాల్సిన పనిలేదని, డిసెంబర్‌ లోపు పక్కగా మిగిలిన రైతులకు రుణ మాఫీ చేస్తామని మంత్రి పోగులేటి హామీ ఇచ్చారు. మిగిలిన 13 వేల కోట్లు చెల్లిస్తామని, త్వరలో రైతు భరోసా ఒక కిస్తి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడిరచారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పట్టిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించిన వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు. వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన వరి ధాన్యం, పత్తి పంట, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటలను అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండిరచిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హావిూ ఇచ్చారు. సన్న వడ్లపై క్వింటానుకు 500 రూపాయల బోనస్‌ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.