దంపతులపై గొడ్డలితో దాడి: భర్త మృతి
గుంటూరు: దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో నిద్రిస్తున్నా దంపతులపై దుండగులు దాడికి దిగారు. గొడ్డలితో దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా… భార్య పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వ్యక్తిగత కక్షల నేపధ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



