దరఖాస్తు చేసుకోవాలి

కడప, జూలై 31 : రైల్వే కొడూరు నియోజకవర్గంలో ఖాళీలుగా ఉన్న 15 చౌక దుకాణాల కోసం అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్‌డివో శ్రీనివాసులు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. పుల్లంపేట, పెనగలూరు, చిత్వేలి మండలాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని ఆయన వివరించారు. అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శాశ్వత కార్డుదారులతో ఖాళీలు భర్తీ చేస్తామని ఆయన వివరించారు.