దలైలామా సైతం వ్యాక్సిన్ వేయించుకున్నారు
సిమ్లా, మార్చి 6 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల మంది టీకా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆసుపత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు.గత సంవత్సరంలో వచ్చి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కారోన మహమ్మారి బారీ నుండి మనల్ని కాపాడేందుకు భారత్ బయోటెక్ సంస్థ కోవిడ్ – 19 కు వ్యాక్సిన్ కనిపెట్టిన విషయం విదితమే.. అయితే గత కొద్దిరోజులుగా ఈ టికాని ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా తీసుకున్నారు. జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే.