దీపావళి హస్యకథలపోటీ
రాజమండ్రి, ఆగస్టు 3 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ఆధ్వర్యంలో 2012 దీపావళి హస్యకథల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ కమీషనర్ ఆర్.వి. చంద్రవదన్ తెలిపారు. పోటీలలో ఎంపికైన ఉత్తమ కథకు 15వేల రూపాయలు, ద్విదీయ ఉత్తమకథకు 12వేల రూపాయలు, తృతీయ ఉత్తమకథకు 8వేల రూపాయలు సాధారణప్రచురణకు ఎంపికైన కథకు 1000 బహుమతులు వుంటాయని తెలిపారు. ఈ పోటీకి కథలు పంపే రచయితలు, రచయిత్రులు నియమనిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు ఆంధ్రప్రదేశ్ ఆగష్టు నెల సంచికలో చూడవచ్చునన్నారు. పొటీలలో పాల్గొనే కథలను 15 సెప్టెబర్, 2012లోగా పంపాలని కమీనర్ కోరారు.