దుర్గామాత ఆలయ శిఖర ప్రతిష్టాపన లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా
రాయికొడ్ జనం సాక్షి మార్చి 09 రాయికొడ్ మండల పరిధిలోని నల్లంపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయ శిఖర ప్రతిష్టాపన లో భాగంగా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామ సర్పంచ్ విఠల్ రెడ్డి ఎంపీటీసీ కే సత్తెమ్మ శ్రీశైలం.మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పటేల్.సుదర్శన్. మండల పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పాటిల్ .. తెలిపారు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని ఉత్సవాలను ఘనంగా జరిగేలా చేశారని ఆయన అన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వినయ్ కుమార్ పాటిల్. బసవరాజ్ పటేల్ సిద్దన్నా పాటిల్,అంజిరెడ్డి వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు