దేశసమగ్రతకు అందరూ కృషి చేయాలిమంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 8 :
పట్టణంలోని జీపీరోడ్డులో ఉన్న జామియా మసీదులో జిల్లా వక్ఫ్‌ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర రహ దారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసా దరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పా ల్గొని వక్ఫ్‌ బోర్డు జిల్లా కమిటీ నూతన అధ్య క్షుడిగా మహ్మద్‌ సలీంఖాన్‌తోపాటు ఉపాధ్య క్షులుగా జిలాని, మరో ఎనిమిది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమగ్రతకు సమైక్యతకు అందరూ కలిసికట్టుగా పనిచ ేయాలని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వక్ఫ్‌ బోర్డు సభ్యులను ఆయన అభినందిం చారు. ఎంపీ కృపారాణి, వక్ఫ్‌బోర్డు సభ్యులను అభినందించి అనంతరం మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను, మసీదులను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, ఎ.వరం, తదితరులు పాల్గొన్నారు