దైవకణం పరిశోధనలో కొత్త కణం గమనించాం:సెర్న్‌

జెనీవా:విశ్వసృష్టికి సంబందించిన దైవకణం పరిశోధనలో కొత్త కణాలను గమనించామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌-సెర్న్‌ ప్రకటించింది.2,100 మంది శాస్త్రవేత్తలతో పనిచేస్తున్న తమ బృందం కొత్త కణాన్ని కనిపెట్టిందని సీఎంఎస్‌ అనే బృందానికి నాయకుడిగా వ్యవహరించిన జో ఇన్‌కాండెలా సెర్న్‌కు వివరించారు.సెర్న్‌లో ఈ విషయంపై రెండు బృందాలు పరిశోదన చేస్తున్నాయి.రెండో బృందం అట్లాస్‌ లోమూడు వేల మందికి పైగా శాస్త్రవేత్తలున్నారు.ఈ బృందం కూడా తమ పరిశోదనలో కొత్త కణాలను కనిపెట్టినట్లు సెర్న్‌ ప్రకటించింది.