ధనలక్ష్మిదేవి అవతారంలో అమ్మవారు

share on facebook

అశ్వరావుపేట అక్టోబర్ 1( జనం సాక్షి )

 

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకొని మండల కేంద్రం అశ్వారావుపేటలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు శనివారం ధనలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. 47వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, సహస్ర నామార్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా స్థానిక జంగారెడ్డిగూడెం రోడ్లోని కనకదుర్గమ్మ
ఆలయం, శిరిడిసాయిబాబ దేవాలయం, డ్రైవర్స్ కాలనీ, గుర్రాలచెర్వు సమీపంలో స్వయంభుగా వెలసిన కనకదుర్గమ్మ ఆలయం వద్ద, రామాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవో పేతంగా జరుగుతున్నాయి. సాయంత్రం బతుకమ్మ ఆటపాటలతో మహిళలు అలరించారు.

Other News

Comments are closed.