ధరణితో విప్లవాత్మక మార్పులు: కలెక్టర్
యాదాద్రి`భువనగిరి,అక్టోబర్30 (జనంసాక్షి): ధరణి అనేది తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పు అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ ధరణికి కలెక్టర్ తంబు తప్పని సరికావడంతో పారదర్శకత పెరిగిందని తెలిపారు. ధరణి వల్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలుగుతున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా 45,222 అప్లికేషన్లు పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడిరచారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ఏడాది క్రితం ప్రారంభించిన ’ధరణి’తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో మాట్లాడారు. ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ సమయంలో రిజిస్టేష్రన్ పక్రియ పూర్తవడంతో పాటు మ్యుటేషన్ కూడా వెంటనే పూర్తవుతోందన్నారు. ధరణిలో 31 రకాల మాడ్యుళ్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రజలు వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.