ధర్మాన రాజీనామకు సానుకూలంగా ఉన్న కాంగ్రెస్‌ హైకమాండ్‌

న్యూఢిల్లీ: మంత్రి ధర్మాన రాజీనామాకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈరోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో అంతకుముందు ఇతర సీనియర్లతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. ధర్మాన రాజీనామా ఆమోదించాలని ఆరోపణలు వచ్చిన ఇతర మంత్రుల విషయంలో పరిస్థితులకు అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకోవచ్చని సూచిందింది.