ధాన్యం కొనాలంటూ రైతుల నిరసనవరంగల్ జాతీయ రహదారిపై వడ్లు పోసి రాస్తారోకో
యాదాద్రి భువనగిరి,నవంబర్16(జనం సాక్షి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్`వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి జాతీయ రహదారిపై పోసి రాస్తా రోకో నిర్వహించారు.దీంతో రహదారి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరి కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేస్తోందని రైతులు ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ, తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.