నంద్యాలలోని ఓ నగల దుకాణంలో చోరీ

కర్నూల్‌: జిల్లాలోని నంద్యాలలో ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణ యజమాని నగలు తీసుకుని వచ్చి దుకాణం తీస్తుండగా స్కూటర్‌లో ఉంచిన నగల సంచీని దొంగలు అపహరించారు. అందులో 877గ్రాముల బంగారం, 4కిలోల వెండి తో పాటు 20వేల రూపాయాలను ఉన్నట్టు యజమాని పోలీసులకిచ్చిర ఫిర్యాదులో పేర్కోన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.