నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టరు అరెస్టు
హైదరాబాద్ : వనస్థలిపురం సహర ఎస్టేట్‌లో నివాసముంటున్న శ్రీరాములు తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి అమెను నానా ఇబ్బందులు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు పిచ్చిదని వైద్యచికిత్సలు చేయించడం మొదలు పెట్టాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతన్ని అడ్డుకోని పోలీసులకు అప్పగించారు. శ్రీరాములను 20 రోజుల క్రితం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే అమె పిచ్చిదని నకిలీ సర్టిపికెట్ సృష్టించిన వనస్థలిపురం డాక్టర్ శేఖర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.



