నత్తనడకన గూడెం ఎత్తిపోతల పథకం

దండేపల్లి : గూడెం ఎత్తిపోతల పథకం మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి రైతులకు నీరు అందివల్సి ఉండగా, పనులు ముందుకు సాగడంలేదు. మూడు కిలో మిటర్లు మేర పైపులైన్లు పూర్తి అయితే పథకం పనులు కొలిక్కి వస్తాయి. ఐతే గూడెం, నెల్కి వెంకటాపూర్‌, చింతపల్లి, తాని మడుగు, వరకు పైపులైన్‌ వేశారు. రెబ్బన్‌ పల్లి శివారులో పరిహరం విషయం రొలిక్కిరాక పోవడంతో నిర్మాణం పనులు అగిపోయాయి. రెబ్బన్‌ పల్లిలో 89 మంది రైతులు 32 ఎకారాల భూమి కోల్పవాల్సి ఉండగా ప్రభుత్వం ఈ భూమికి నష్టపరిహరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 2.8 లక్షల నుంచి 2.9 లక్షల వరకు ఇస్తామని ఆధికారులు చేపుతున్నారు. ఐతే గ్రామస్థులు ఆక్కడి మార్కెట్‌ విలువ ప్రకారం ఎకారంకు రూ. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇవ్వమని కొరుతూ రైతులు పనులను అడ్డు కుంటూన్నారు. దీని వలన ఇక్కడ పనులకు అంతరాయం ఏర్పాడుతుందని అధికారులు చేప్పుతున్నారు.