నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) చైర్మన్ గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డి, డైరెక్టర్లు
నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) చైర్మన్ గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డి, డైరెక్టర్లు గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లతోపాటు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నార్ముల్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలంధర్ రెడ్డి, రచ్చా లక్ష్మీ నరసింహారెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.