నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్‌ను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్‌ జగన్‌ను పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు అయన్ను చంచల్‌గూడ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. ఈ కేసులో మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయ సాయిరెడ్డిలతోపాటు ఐఏఎస్‌ అధికారులు మన్మోహన్‌సింగ్‌, శామ్యూల్‌లను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వీరితోపాటు మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కూడా కోర్టుకు హాజరయ్యారు.