నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం బాధాకరం

కర్నూలు:  ముగడిచిన పది సంవత్సరాలలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నాగార్జున అగ్రోకెమ్‌ పరిశ్రమలో ప్రమాదం జరగడం బాధాకరమని స్థానిక శాసనసభ్యుడు, వైద్య  విద్యాశాఖ మంత్రి కొండ్రు రళి కర్నూలులో చెప్పారు. ప్రమాద ఘటనపై మంత్రి స్పందించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని  14 మంది గాయపడగా 12 మందికి శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.