నాట్య గణపతికి నాట్య నీరాజనాలు స్వర్ణ కంకణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఆగస్టు28(జనంసాక్షి):

హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో RK కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు సుమన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన నాట్య గణపతికి నాట్య నీరాజనాలు స్వర్ణ కంకణ మహోత్సవం, సాంస్కృతిక కళాకారులకు అవార్డుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ…

గౌరవ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత సాంస్కృతిక, కళ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, సాయిచంద్ ఇలాంటి వారికి గౌరవ దక్కింది. కళ రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.

గతంలో ఉన్న ప్రభుత్వాలు కళ రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యాటక శాఖ అయిన శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక, కళరంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ గారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో RK ఫౌండేషన్ అధ్యక్షులు రంజిత్ కుమార్, Rtd జడ్జి మధుసూదనాచారి, రాజశేఖర్ రెడ్డి, దైవజ్ఞశర్మ, అరికపూడి రఘు, రామచంద్రరావు, ఆంజనేయులు, లక్ష్మీ సామ్రాజ్యం, శ్రీనివాసచార్యులు, రాజు, శకుంత రెడ్డి, శ్రీ నారాయణ మూర్తి, శ్రీనివాస మూర్తి, సుజాత, నర్సింహ రెడ్డి, శిరీష రాణి, సినీ నటులు పూజిత, ముసా అలీఖాన్, నాట్య గురువులు కాంతారావు, గీత, నట సాయి, జయలక్ష్మి, మనోహర్, నృత్య కళాకారిణులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.