నానో యూరియా వాడకంతో మరోసారి దేశానికి దిక్సూచిలా నిలబడాలి
ఆగస్టు 26 (జనం సాక్షి);
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకతపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు కమీషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, తదితరులు
ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శం
భారతీయుడైన రమేష్ రాలియా దీనిని కనుగొని భారత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని ఆ టెక్నాలజీని మన దేశంలోని ఇఫ్కో సంస్థకు అందించారు
36 వేల సహకార సంఘాల సమాఖ్య అయిన ఇఫ్కో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ
11 వేల మంది రైతుల పొలాలలో నానో యూరియాను ప్రయోగించి ఫలితాలు పరిశీలించి మార్కెట్ లోకి విడుదల చేశారు
తొలిసారి యూరియాను ద్రవరూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకువచ్చారు
దీనిమూలంగా ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారు
దేశంలో పంటల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మొదలయింది
దేశంలోని జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్దతులను అనుసరించడం ప్రారంభించారు
సాంప్రదాయ విత్తనాలను పక్కనపెట్టి అత్యధిక ఉత్పత్తి నిచ్చే ఆధునిక హైబ్రిడ్ విత్తనాలను అందుబాటులోకి తెచ్చారు
1960 దశకంలో లాల్ బహదూర్ శాస్త్రి దీనిని పంజాబ్ లో మొదలు పెడితే బాబూ జగ్జీవన్ రామ్ దానిని కొనసాగించారు
రైతులను ప్రోత్సహించి గోధుమలు సాగుచేయించి క్వింటాలుకు రూ.50 మొదటి సారి కనీస మద్దతుధర ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా దేశంలో 29 పంటలకు మద్దతుధర ఇవ్వడం జరుగుతున్నది
మానవాళికి, జీవరాశికి అవసరమైన ఆహారం అంతా ఈ భూమి నుండి ఉత్పత్తి కావాల్సిందే
మానవుడి యొక్క ఆహారాన్ని వ్యవసాయం అనే శాస్త్రీయ విధానం ద్వారా ఉత్పత్తి చేసే విధానం దాదాపు పది వేల ఏళ్ల క్రితమే మొదలయింది
ప్రాచీన వ్యవసాయ నాగరికత కలిగిన దేశం భారతదేశం
పంటలు పండడానికి ప్రధానంగా భూమిలో పోషకాలు అవసరం.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి
రసాయనిక ఎరువుల వాడకంలో సరయిన పరిజ్ఞానం రైతులకు గత ప్రభుత్వాలు కల్పించకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు వాడారు
దీంతో భూమిలో పోషకాలు లోపించడం, అధికం కావడం జరిగింది
భూమికి అవసరమైన పోషకాలు ఏమిటి ? ఎంత వాడాలి ? అన్నదానిపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది
దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం
అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి
ఇటువంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం
దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా యూరియాను మోతాదుకు మించి వాడుతున్నాం
ఈ నేపథ్యంలోనే నానో యూరియా వైపు రైతులను మళ్లించాలని నిర్ణయించాం
ట్రేడర్లు, వ్యాపారులు, వ్యవసాయ అధికారులు , శాస్త్రవేత్తలు రైతులను ఈ దిశగా మళ్లించేందుకు సహకరించాలి
నానో యూరియా వాడకం మూలంగా మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది పంట వేగంగా ఎదుగుతుంది
దీంతో యూరియా గడ్డకట్టడం, రవాణా ఖర్చులు అధిగమించడం, గోదాముల నిల్వ ఇబ్బందులు, విదేశీ దిగుమతులు తగ్గించుకోవడం జరుగుతుంది
500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానం
యూరియా కేవలం 30 నుండి 50 శాతం మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది
నానో యూరియా 80 శాతం వరకు పనిచేసి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది
తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం