నిజం బాంబు కాదు,పొగబాంబు

ముంబయి:ముంబయి ప్రజలు బాంబు కలకలంతో ఆందోళన చెంది నిజం బాంబు కాదు అని వూపీరి పీల్చుకున్నారు.ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని అందేరీ ప్రాంతంలో ఇన్‌ఫినిటీ మాల్‌ వద్ద చెత్తబుట్టలో కన్పించిన అనుమానాస్పద వస్తువు సినిమాల్లో పొగ సృష్టించడానికి వాడే పొగబాంబని బాంబు స్క్వాడ్‌ తెల్చి చెప్పింది.అనుమానాస్పద వస్తువు ఉందన్న వార్త తెలియగానే అప్రమత్తమైన బాంబుప్క్వాడ్‌ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి క్షుణ్ణంగా శోధించింది.అనుమానాస్పదంగా కన్పించింది పొగబాంబు తప్ప మరేమీ కాదని హమీ ఇచ్చింది.దాంతో అధికారులు ప్రజలు కూడా హయిగా వూపిరి పీల్చుకున్నారు.