నిత్యానంద కోర్టులో లొంగుబాటు

బెంగళూరు :
ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్‌నగర్‌ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నిత్యానందను అరెస్టు చేసేందుకు రెండు రోజులుగా పోలీసులు యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి ఆయన మాయం కావడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేప ట్టారు. అయితే ఎవరూ ఊహిం చని రీతిలో ఆయన బుధవారం నాడు కోర్టులో లొంగిపోయారు. ఆయనపై అనేక ఆరోపణలు, కేసులు ఉన్న విషయం తెలిసిందే. గత అయిదేళ్ల నుంచి వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ముఖ్య మంత్రి సదానందగౌడ్‌కు తాజాగా ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయన్నుఅరెస్టు చేయాలని సదానందగౌడ్‌ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగడం విదితమే. ఇదిలా ఉండగా నిత్యానందకు చెందిన బిదాడి ఆశ్రమంపై పోలీసులు సోదాలు నిర్వహించినట్టు, పలు కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.