ఘనంగా ఉర్సు ఉత్సవాలు

గంభీరావుపేట జనవరి 01 (జనం సాక్షి):
హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీం
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో హజ్రత్ మీరా శాహ ఖాద్రి హలయ్ ఉత్సవాలు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి వీధుల గుండా తిరుగుతూ అబ్దుల్ రహీం బ్రదర్స్ గ్రంథంతో ఇంటి నుండి మొదలై వీధుల గుండా ఊరేగింపుతో తిరుగుతూ దర్గాకు చేరుకుంది, అనంతరం దర్గాలో పూజలు నిర్వహించి ప్రసాదం అందజేశారు, అబ్దుల్ రహీం మాట్లాడుతూ_ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అల్లాని ప్రార్థించామని గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ విజయవంతం చేయవలసిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహీం బ్రదర్స్ మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


