నిత్య మరణానికి నివాళేది ?

నిరుడు మలేరియా విభాగానికి అందవలసిన నిధుల్లో రెండు కిస్తులు మాత్రమే లభించాయి. దో మల మందు స్ప్రే చేసిన కూలి వారికి 5,22,680 రూపాయల కూలీ బాకీ ఉండిపోయింది. అది ఇ వ్వనిదే ఈసారి మందు కొట్టం అని వారు మొరా యించారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసి వారికి ఇవ్వాలని అధికారులు మీమాంసలో పడ్డారు. నా లుగు నెలల పాటు తర్జన భర్జనలు జరిపినా ఆ 5 లక్షల చిల్లర ఎక్కడ నుంచి తేవాలన్న నిర్ణయం చే యలేక వేలాది ఆదివాసి కుటుంబాలను మలేరి యా పాలు చేశారు.

ఒకచావు అన్ని చావుల్ని కప్సేసింది. వాస్తవం లో కాదు, వార్తల్లో . ఒక మరణం, ఆమరణానికి తట్టుకోలేక మరణాలుగా వార్తల కెక్కినవి కలిసి వే రే మరణాలను వార్తల నుంచి బయటకు నెట్టే స్థా యి. కప్పేయడం నిజానికి అంతకుముందే మొద లైంది. రమ్యనిందనీరెడ్డి అన్న పేరు వింటే మీకేం తోస్తుంది? పేరుకు తగ్గట్టు స్వైన్‌ఫ్లూ వచ్చి ఉంటే చచ్చినా బతికినా మొదటి పేజీలో ఫోటో అయి ఉండేది. నలుదిక్కులా వార్త అయి ఉండేది. కానీ ఈ పాప కూటికి లేని కొండరెడ్డి కొంపలో రంప చోడవరం ఏజెన్సీలో పుట్టింది.

మలేరియా అని ప్రభుత్వం ఒప్పుకొని మలేరి యాతో రెండేళ్లకే వందేళ్లు నింపుకుంది. గోచిపూత లేకున్నా పేర్లలో షోకులకు పోవచ్చును, దానికి కా వలసిన జ్ఞానం డిష్‌టీవీ నుంచి పొందవచ్చును. కానీ పేరుకు ఉన్న షోకు చావుకు ఎక్కడి నుంచి రావాలి ? మలేరియా మలేరియా ఎందుకు కా కుండా పోతుంది, ప్రవేటు ఆస్పత్రి మలేరియాగా గుర్తించినది ప్రభుత్వ ఆస్పత్రిలో వేరోకటి ఎందుకు అవుతుందని తెలుసుకోవడానికి సీబీఐ విచారణ కోరుదామా ? ఏప్రిల్‌ 15న మొదలు కావలసిన దోమల మందుల స్ప్రే ఈ సంవత్సరం ఆగస్టు మొ దటి వారం దాకా ఎందుకు మొదలు కాలేదో విచా రించి తెలపమని సీబీఐని అడుగుదామా ? రంప చోడవరం ఏజెన్సీలోని 37 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు ల్లో 23 ఎందుకు ఖాళీగా ఉన్నాయో శోధించి చెప్పమని సీబీఐని అభ్యర్థిద్దామా ? మనం అడిగితే ఒప్పుకోరు కాబట్టి కేంద్రాన్ని అడగమని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోరుదామా ? కానీ రోజూ చచ్చేవాడి కో సం ఏడ్చేవాడెవడూ ? అంటారెమో.

రోశయ్య పేరుకు ముందూ వెనకా ముఖ్య మంత్రి అర్హతకు కావలసిన రెండు పొడి అక్షరాలు లేకపోవచ్చును గానీ సామెతలు బాగా చెప్తాడు. అ నుమానం ఉంటే చంద్రబాబును అడగండి. ప్రస్తు తం అతను కాంగ్రెస్‌ నాయకుల్లో దైవ లక్షణాలు కనుక్కునే మూడ్‌లో ఉన్నాడు కాబట్టి ఒప్పుకుంటా డు. నిజమే, ప్రతీ సంవత్పరం వర్షాకాలం మొద లయ్యీ కాక ముందే ఏజెన్సీని వణికిస్తున్న జ్వరా లు అంటూ దినపత్రికల లోపలి పేజిల్లో తిర్యాని నుంచి, మంగపేట నుంచి, అడ్డతీగల నుంచి హు కుంపేట నుంచి ఫంక్తుల వార్తలొస్తుంటాయి.

అప్పుడప్పుడు టోకున చావులు గణాంకాలు కూడా ఇస్తుంటారు. రెండు నెలలు ఊపిరి బిగప ట్టుకుంటే లేదా ఆ డేట్‌లైన్‌ ఉన్నా వార్తలు చూడ కుండా ఉంటే అవే పోతాయి. దానికి విచారణలూ శాశ్వత పరిష్కారాలూ ఎందుకు, రాచముద్ర ఉన్న విచారణలు చేపట్టవలసిన సీబీఐని అవమానపరచ డం నా ఉద్దేశం కాదు. రాచముద్ర కాకపోతే రహ స్యమైనా ఉండాలి. ఇందులో రహస్యం మాత్రం ఏ ముంది ? జిల్లా మలేరియా ఆఫీసర్‌ టీడీఏపీవో మలేరియా, ఫైలేరాయా రోగాలు లేనేలేవని చెప్ప డం కోసం (సారీ, వాటి నివారణకోసం) ప్రత్యేక హోదా ఇయ్యబడ్డ ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ ఉత్తరాలు ప్రత్యుత్తరాలతో నోట్‌ ఫైల్స్‌ అని అధికా రులు ఆప్యాయంగా పిలుచుకునే దస్తావేజులు నిం పారు. సమాచార హక్కు చట్టం కింద వాటిని సహి తం మనం చూడవచ్చు.

చట్టం ఉన్నా లేకున్నా ఆ అధికార్లంటే గిట్టని వాళ్లను పట్టుకుని నోట్‌పైల్స్‌ ఫోటోస్టాట్‌ సంపా దించడం యోగ్యులైన ఉద్యమకారులకు తెలిపిన విద్యే. గడిచిన నాలుగు నెలలుగా నడిచిన ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే నిరుడు మలేరియా విభాగానికి అంద వలసిన నిధుల్లో రెండు కిస్తులే లభించాయి. మరో రెండు కిస్తులు ఏ  కారణంగా లభించలేదు.

అందువల్ల నిరుడు రెండోసారి దోమల మం దు స్ప్రే చేసిన కూలీ వారికి 5,22,680 రూపా యల కూలీ బాకీ ఉండిపోయింది. అది ఇవ్వనిదే ఈసారి మందుకొట్టం అని వారు మొరాయించా రు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసి వారికి ఇవ్వా లి అన్న మీమాంస ఈ అధికారుల నోట్‌ఫైల్స్‌లో మనకు కనిపిస్తుంది. నాలుగు నెలలపాటు తర్జన భర్జనలు జరిపి నా ఆ 5 లక్షల చిల్లర ఎక్కడ నుం చి తేవాలన్న నిర్ణయం చేయలేక వేలాది ఆదివాసీ కుటుంబాలను మలేరియా పాలు చేశారు.

డబ్బులు బాకీ ఉన్న కూలీవాళ్లు మొరాయిస్తే మరి వేరే వాళ్లనెందుకు పెట్టుకోలేదు? దిన కూలీ ఇచ్చి చేయించుకునే పనే కదా ? అది నైపుణ్యంతో కూడిన పని కాబట్టి వీలుకాదంట. నైపుణ్యంతో కూడిన పనైతే ప్రతీ సంవత్సరం వారే చేసేటట్ట యితే, వారు దిన కూలీలుగా ఎందుకున్నారు. ప్ర భుత్వనికైనా పరిశ్రమలకైనా కొత్తేం కాదు కదా? అప్పుడొక వేళ జీతం బకాయిపడినా ఉద్యోగం నిలబెట్టుకోవడానికి పనిచేసేవారు కదా? అయినా రంపచోడవరం ఏజెన్సీలో 624 గ్రామాలను (మొ త్తం గ్రామాల్లో ఇది 90 శాతం కంటే ఎక్కువ) మ లేరియా ఎండెమిక్‌గా అధికారికంగానే గుర్తించిం నప్పుడు జిల్లా మలేరియా అధికారి వద్ద కొంతైనా కంటింజెన్సీ ఫండ్‌ ఎందుకు రాలేదు? ఆయన గా రు ఒక అసిస్టెంట్‌ మలేరియా అధికారి, మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రాంతాలకు కలిపి ఒ క సబ్‌యూనిట్‌ అధికారి తప్ప రోడ్ల వెంబడి తిరిగి పనిచేసే సిబ్బంది వారి కింద ఎందుకు రాలేదు? కూలీ వాళ్ల బకాయిలకు పైసలు లేకపోవడమే కా దు, ప్రతీ సంవత్సరం మార్చి నెలలో సరఫరా కావ లసి ఉన్నా దోమల మందు ఈ సంవత్సరం జూన్‌ నెల దాకా రాలేదంట.

దానికి కారణం ఎవరికీ తెలిసినట్టు లేదు కా బట్టి అడిగి ప్రయోజనం లేదు గానీ అవసరమైన ప్పుడు మార్కెట్‌లో కొనుగొలు చేసే అధికారం, దా నికి విడిగా కొంత ఫండ్‌ జిల్లా మలేరియా అధికా రి దగ్గర ఎందుకు లేవు? నాకు స్టాఫ్‌ లేరు అంటూ  దర్జాగా బల్లకింద కాళ్లూపుకుంటూ కూర్చునే వైభో గం అతనికెందుకిచ్చారు? వేరొక సందర్భమైతే ఇంక వివేచించడం అనవసరం అని ఆపేద్దుము గానీ మనం ఐదేళ్లుగా దీనజన రాజ్యంలో బతికమ ని స్వపక్షం, విపక్షం, ఒక వామ పక్షం, టీవీల్లో ద ర్శనమిచ్చే, పలువురు నిత్య విమర్శకులే కాక ఆ రెండు పత్రికలు కూడా చెప్ప్తనాయి. కాబట్టి కొన్ని జ్ఞాపకాలను దూరం చేయడం కష్టం.

ఏజెన్సీలో జ్వరాలనూ చావులనూ ఎందుకు ఆపలేకపోతున్నామో తెలపమని 2005లో కేఆర్‌ వేణుగోపాల్‌ అనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని జాతీ య మానవ హక్కుల కమిషన్‌ పురమాయించిది. ఆయన విశాఖపట్నం. ఏజెన్సీలోని పరిస్థితిని వివ రంగా పరిశీలించి రిపోర్టు ఇచ్చారు. ఇపుడు ఆశా వర్కర్‌ అని ప్రభుత్వం ముచ్చటైన కొత్త పేరుపెట్టిన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌ ఉద్యోగ భద్రత గురించి, రోగమస్తే తట్టుకునే శక్తిని ఇచ్చే పౌష్టికాహారం పొందగల స్తోమత గురించి, పరిసరాల పారిశుద్దాన్ని గురించి, మూడవ వంతు కుటుంబాలకు కూడా అందని దోమ తెరల సరఫరా గురించి, మొబైల్‌ ఉండవలసిన ఏజెన్సీ వైద్య వ్యవస్థ మొబిలి టీ సంగతి అటుంచి సగభాగం అసలే లేకపోవడం గురించి ఆయన తీవ్ర విమర్శ చేశారు.

నిర్ధిష్టమైన సూచనలు చేశారు. నాలుగేళ్లయిం ది కాబట్టి ఆ నివేదిక ప్రభుత్వానికి అందే ఉంటుం ది! ఈ నాలుగేళ్లలో ఏం మారిందన్న ప్రశ్న వేసు కుంటే శూన్యం అన్న జవాబు చెప్పవలసి ఉంటుం ది. కమ్యూనిటీ హెల్త్‌వర్కర్‌ పేరొక్కటి మారింది. ఆదిలాబాద్‌లోనైతే ఒకడగు వెనక్కివేసి ఏజేన్సీలో ఎండెమిక్‌గా ఉన్న రోగాలను నయం చేయడం ప్ర భుత్వ వైద్య వ్యవస్థ వల్ల కాదని చేతులెత్తేసి స్వచ్ఛం ద సంస్థలకు అప్పగించే ప్రయోగం మొదలు పె ట్టారు. పబ్లిక్‌ హెల్త్‌ రంగంలో ఈ విధంగా చేతులె త్తేయడం ప్రస్తుత దుస్థితికి గల ఒక ముఖ్యకారణం అనే కేఆర్‌ వేణుగోపాల్‌ విమర్శలో ప్రధాన అంశం కాగా, చేసిన తప్పు ఇంకొంచెం చేయడమే సమస్య కు పరిష్కారం అయినట్టు చికిత్స విషయంలోనూ అదే పనిచేస్తున్నారు.

ప్రైవేటీకరణతో మన అనుభవం ఏమిటంటే ఏ కారణంగానైతేనేం అది మొదట్లో కొంత ఫలితా న్ని ఇస్తుంది. (ఇది కుట్ర అనే వాళ్లు లేకపోలేదు) అందువల్ల వ్యాపిస్తుంది. చివరికి దాని దుష్పలితా లు తెలిసేసరికి వెనక్కి తిప్పడం కష్టం అవుతుంది. పౌష్టికాహారం విషయానికొస్తే పెద్దల సంగతి అ టుంచి పిల్లలకు కనీసం ఒక పూట అన్నం పెట్టే అంగన్‌వాడీ కేంద్రాలు ఆదివాసీ ప్రాంతాల్లోని స గం గూడాల్లో ఆనాడూ లేవు. ఈనాడూ లేవు. ఉ ట్నూరు నుంచి సీతం పేట దాకా ఏ ఎజెన్సీ గ్రా మంలో వాకబు చేసినా ఈ సత్యం తెలుసుంది.

ఏజెన్సీ మృతుల్లో చిన్న పిల్లలే ఎక్కువగా ఉం డడానికి ఇదొక కారణమని వివరించి చెప్పనవస రం లేదు. సంగతి స్పష్టమే. వాళ్లంటే లెక్కలేకపోవ డం తప్ప విచారించి బయటపెట్టవలసిన రహస్య మేదీ లేదు. ఇక విచారణలు కోరడం ఎందుకు ?

– కె.బాలగోపాల్‌