నిద్ర లేచిన ఆర్టీఏ అధికారులు

ట్రావెల్‌ ఏజెన్సీలపై ఆర్టీఏ దాడులు
సీమాంద్ర ట్రావెల్స్‌ అన్ని అక్రమాల పుట్టలే
ఒక పర్మిట్‌పై మూడు సర్వీసులు
రికార్డులు స్వాదీనం చేసుకున్న అధికారులు
హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలపై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలపై నిఘాపెట్టాలని, నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడుపుతున్న ట్రావెల్‌ ఏజెన్సీలపై తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ ఆదేశాలతో రవాణా శాఖలో కదలిక వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్‌ ఏజెన్సీ కార్యాలయాలపై సోమవారం ఉదయంనుంచి సాయంత్రం వరకూ రవాణా శాఖ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో నకిలీ ట్రావెల్‌ కంపెనీల లోగుట్టు వెలుగు చూసినట్లు తెలుస్తున్నది. అలాగే మరికొన్ని కీలక ట్రావెల్స్‌ ఏజెన్సీలకు సంబంధించిన రికార్డులను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోని ట్రావెల్స్‌ కార్యాలయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. కేశినేని, కాళేశ్వరి, ధనుంజయ్‌, నవీన్‌, ఎస్వీఆర్‌, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన పైళ్లను, రికార్డులను పరిశీలించారు.చాలా ట్రావెల్స్‌ కారర్యాలయాల్లో ప్రయాణికులకు సంబందించిన రికారుడ&ఉల వివరాలు లేవని తమ దాడులలో తేలిందని, బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల్లో అధికారలు తనిఖీలు నిర్వహిసుత్నఆ్నమని రవాణా శాఖ అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. డ్రైవర్ల నియామకానికి సంబందించి కొత్త విధానాన్ని అమలుచేయాలని ఆలోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలుపంపి ఆమోదం తర్వాత ఈ విధానాన్ని అలమలు చేస్తామని చెప్పారు.అక్రమాలెన్నెన్నో ! ప్రైవేటు ట్రావెల్స్‌పై నిఘా పెట్టాలంటూ సీఎం ఆదేశించడం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించడానికి ట్రావెల్స్‌ సంస్థలు పలు అక్రమాలకు అవకతవకలకు పాల్పడుతున్నట్టు అందిన సమాచారమే కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ ఆదాయానికి ఏటా వెయ్యి కోట్లకు పైగా గండికొడుతున్న ప్రైవేటు బస్సుల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మూడు వేల వరకు బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో కనీసం రెండు వేల వరకు నిబంధనలను పాటించట్లేదని అధికారుల అంచనా. కాంట్రాక్టు క్యారియర్ల కింద అనుమతి తీసుకుంటే రాష్ట్ర పరిధిలో ప్రతి సీటుకు మూడు నెలలకోసారి రూ.2,265, దేశవ్యాప్తంగా తిరిగేందుకు రూ.3,675 చొప్పున రవాణా శాఖకు ఆపరేటర్లు చెల్లించాలి. ఆ లెక్కన 54 సీట్లున్న ఒక్కో బస్సుకు మూడు నెలలకు స్టేట్‌ సర్వీసుకు రూ.1.42 లక్షలు, ఆలిండియా పర్మిట్‌కైతే దాదాపు రూ.2 లక్షల చొప్పున ఆపటరేటర్లు చెల్లించాలి. కానీ ఈ లెక్కన పర్మిట్‌ ఫీజులను చెల్లిస్తున్న సంస్థలు అతి తక్కువే. ఇక కాంట్రాక్టు క్యారియర్‌ నిబంధనలను కూడా పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్రంలో సగటున 75 వరకూ బస్సులను నిర్వహిస్తున్న సంస్థలు 40కి పై మాటే. ఇవి కాక చిన్న సంస్థలు 50 వరకూ ఉన్నాయి. ట్రావెల్స్‌ లీలలపై రవాణా శాఖ అదికారులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు ప్రైవేటు ఆపరేటర్లు ఖజానాకు గండి పెడుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఒకటే పర్మిట్‌ తీసుకుని, దానిపై రెండు బస్సు సర్వీస్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అదెలాగంటే కొన్ని బస్సులకు అసలు రిజిస్ట్రేషన్‌ చేయించరు. మరో బస్సు నంబర్‌నే ఆ బస్సుకూ వేస్తారు. అంటే ఒక పర్మిట్‌ లేదా ఒక రిజిస్ట్రేషన్‌పై రెండు బస్సులు అని ఓ అధికారి చెప్పారు. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇవి తమ అనుమానాలు మాత్రమేనన్నారు. ఇదిలా ఉండగా షోలాపూర్‌ దుర్ఘటన నేపథ్యంలో తమ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని ఆందోళన చెందుతున్న ప్రైవేటు ఆపరేటర్ల్లు లాబీయింగ్‌కు శ్రీకారం చుట్టారు.