నిధి సేకరణకు సహకరించండి

కరీంనగర్‌, జూలై 23 : పేదలు, వృద్ధులు, అనాథలు సంరక్షణకు సేవలందిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీకి వివిధశాఖల అధికారులు తమ వంతుగా నిధి సేకరణకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశవారధి రెడ్‌క్రాస్‌ కార్యక్రమాలను వివరిస్తూ జిల్లా అధికారులు తమ వంతుగా రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలకు తోడ్పాటునందించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో 18 సం||లోపు బాలబాలకలు ఆరోగ్యశ్రీ పథకంలో కవర్‌ కాని వ్యాదులు, అందించనున్నట్లు ఆమె తెలిపారు. గతంలో హృదయస్పందన ద్వారా ఉద్యోగసంఘాలు, ఉద్యోగులు తమ వంతుగా సహకారం అందించి ముందుకు తీసుకెళ్లారని వ్యక్తం చేశారు. జిల్లా శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ రెండు కార్యక్రమాలకు నిధి సేకరణకు తమ ఒకరోజు వేతనం విరాళంగా అందించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జెసి అరుణ్‌కుమార్‌, అదనపు జెసి సుందర్‌ అబ్నార్‌, డిఆర్‌ఓ పిచి ఆర్‌ ప్రసాద్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యదర్శి సిద్దుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.