నిప్పుల కొలిమి!

C

– సూర్యప్రతాపానికి 17 మంది మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి): భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తెలుగు రాష్టాల్ల్రో  ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం వడదెబ్బ తగిలి 17 మంది మృతి చెందారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌లో ఒకరు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బకు రెండు రోజుల్లో 28,000 కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన హయత్‌నగర్‌ మండలం గండిచెరువు గ్రామంలో జరిగింది. దీంతో పౌల్టీ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అడవుల్లో నీరు లభించక పలునెమళ్లు మృతి చెందాయి.  మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకశాముందని ఐఎండీ ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్టాల్రకు హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 25 రాష్టాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. మరోవారం రోజులు పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారి నర్సింహరావు తెలిపారు. తుఫాను,అల్పపీడనం ఏర్పడకపోతే మే నెలాఖరు వరకు ఇలాగే ఎండలు కొనసాగుతాయని

ఆయన అన్నారు. పొడి వాతావరణం కారణంగా గత పదేళ్లలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు. అలాగే మరోవారం రోజులు పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారితెలిపారు. తుఫాను,అల్పపీడనం ఏర్పడకపోతే మే నెలాఖరు వరకు ఇలాగే ఎండలు కొనసాగుతాయని ఆయన అన్నారు. పొడి వాతావరణం కారణంగా గత పదేళ్లలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రచండ భానుడి ప్రతాపంతో తెలుగురాష్టాల్ల్రో  ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జనం బయట కాలు పెట్టాలంటేనే హడలిపోతున్నారు.  ఆదిలాబాద్‌, నిజామాబాదుల్లోనూ ఎండ రికార్డులు సృష్టించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 2014 ఏప్రిల్‌లో 43.5 డిగ్రీలు అత్యధికం. శుక్రవారం ఇక్కడ 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 2009 ఏప్రిల్‌లో నిజామాబాద్‌లో ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలు నమోదు అవగా శుక్రవారం 44.9 డిగ్రీలకు పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఏప్రిల్‌లోనే రికార్డులు తుడిచిపెట్టుకుపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో అనే ఆందోళన ఎక్కువైంది.  బంగాళాఖాతం నుంచి తేమగాలులు కోస్తా, రాయలసీమ, తెలంగాణపై ప్రభావం చూపుతుంటాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచి అనుకునంతగా తేమ గాలులు రావడం లేదు. సాధారణంగా మార్చిలో దక్కన్‌ పీఠభూమిపై ఏప్రిల్‌లో మధ్యభారతం, మేలో ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మార్చి నుంచి ఎండలు పెరిగినా అందుకు తగినంతగా బంగాళాఖాతం నుంచి తేమగాలులు రావడంతో కొంత ఉపసమనం కలుగుతుంది. కానీ ఈ ఏడాది తేమగాలుల ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. వడగాల్పులు తీవ్రమైన నేపథ్యంలో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు ఇవాల్టి నుంచి సెలవులు ప్రకటించారు