నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం దృష్ట్యా జంట నగరాల్లో 359 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విటిని నిమజ్జన కేంద్రాల నుంచి ఆయా ప్రాంతలకు నడపనున్నట్లు చెప్పారు.