నిరసన కార్యక్రమానికి ముందుగానే అక్రమ అరెస్టులు
! భూపాలపల్లి ప్రతినిధి ఆగస్ట్ 23 జనం సాక్షి : భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేయవలసి ఉండగా ముందుగానే మార్గమధ్యంలో క్రమంగా అరెస్టు చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అనంతరం అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా జయశంకర్ జిల్లా భూపాలపల్లి సెంటర్ లో నిరసన కార్యక్రమం ముందుగానే అక్రమంగా అరెస్టు చేసి కనీసం నిరసన చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ నీ అనేక మైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కానీ దేనికి భయపడకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్యలను తీర్చేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక మైనటువంటి సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన టువంటి హామీలను పక్కన పెట్టి ఎవరైతే సమస్య ఉన్నదని చెబుతారు వారిని హింసించి అనేక మైనటువంటి కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తుందన్నారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావడం ఖాయమన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి అనేక మైనటువంటి సమస్యలను పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని దీనికి దీనికి తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి ,ఓ బి సి అధ్యక్షులు దొంగల రాజేందర్ ,దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద మహేష్ గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య ,అర్బన్ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి, కె నరేష్, ఆర్ సదానందం, ఆర్ విప్లవ్ కుమార్ రెడ్డి , రాకేష్, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.