నిరుద్యోగులను వంచిస్తున్నారు

share on facebook

నిజామాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అణచివేత విధానాలు కొనసాగిస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా తప్పయ్యిందని, నిజాం పాలనను తలపించేలా నిర్బంధాలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కేసీఆర్‌ పాలన నిజాంను తలపిస్తోందని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాల ఆశలు కల్పించి ఇప్పడు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని అయితే ఇది కేవలం ప్రభుత్వానికి, కేసీఆర్‌ కుటుంబానికే అని ఎద్దేవా చేశారు.

 

Other News

Comments are closed.