నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు సుజిత్ రావు

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు , కాంట్రాక్టర్ కూన గోవర్ధన్ తల్లి సత్తమ్మ ఇటీవలే మరణించగా ,టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ , కల్లెడ గంగాధర్ , శ్రీకాంత్ , గణేష్ ,చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.