నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోయారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. తగినంత నిల్వలు లేకపోయినా కరవు సమయాల్లో నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల నుంచి నీటిని విడుదల చేసుకోవచ్చని గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ కేంద్రానికి సూచించిందని వడ్డే గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం హైకోర్టులో బలహీనమైన వాదనలు వినిపించడం ద్వారా సమస్యను జటిలం చేసిందని ఆయన విమర్శించారు. డెల్టాకు నీటి విడుదల  వ్యవహారాన్ని ప్రాంతాల మధ్య సమస్యగా చూడడం దురదృష్టకరమన్నారు. పులిచింతల ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.