నీలం తుపాన్ బాధితులను ఆదుకోవాలి
ఖమ్మం, నవంబర్ 15 : నీలం తుపాన్ ప్రభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 15వేలు చెల్లించాలని, తడిసిన, ముక్కిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలను రద్దు చేసి కొత్తవాటిని వడ్డీలేకుండా మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో 3.5 లక్షల ఎకరాలలో వేసిన వివిధ రకాల పంటలు వేసి రైతులు నష్టపోయారని అన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా చేసిందేమిలేదని ఆయన అన్నారు.