నూతనంగా నిర్మించిన గిడ్డంగులను ప్రారంభించనున్న విప్ రేగా… 

బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 28 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల కేంద్రం లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్చి 01 వ తేదీన బుధవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన గిడ్డంగులు మరియు రైతు శిక్షణ కేంద్రం ప్రారంబించనున్నారు.ఉదయం 9:00గం కు మోరంపల్లి బంజర్ లో బూర్గంపహాడ్ పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో రు.27లక్షల14వేల రూపాయలతో  నిర్మించిన గిడ్డంగిని, ఉదయం 11:00గం కు రు.13లక్షల 82 వేల రూపాయలతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్రం, మధ్యాహ్నం 12:00గం కు ఇరవెండి లో స్థల దాత తాళ్ళూరి పంచాక్షరయ్య సహకారంతో రు.36 లక్షల 21వేల రూపాయలతో నిర్మించిన గిడ్డంగిని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా డి సి సి బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, డిసిఓ ఎన్. వెంకటేశ్వరరావు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాలకు బూర్గంపహాడ్ మండల రైతులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, పార్టీ మండల కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు కార్యకర్తలు, అభిమానులు హాజరు కాగలరని పి ఎ సి ఎస్ చైర్మన్ బిక్కసాని కోరారు.