నేడు ఖమ్మం కలెక్టర్‌ రాజధానిపయనం

ఖమ్మం : కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లున్నారు. ఈ నెల 8,9,10 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్నందున ముందుగానే సీఎంను కలిసి జిల్లాలో సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలను కలెక్టర్‌ రూపొందిచినట్లు సమాచారం. జిల్లాలో పరిస్ఠితులను ముందస్తుగా కలెక్టర్‌తో చర్చించి చేపట్టాల్సిన చర్చల పై సీఎం అనుమతులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష తేదేపా ప్రజాప్రతినిధులు పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సీఎం ప్రకటనను అడ్డుకుంటామని హెచ్చరింస్తున్నందున కలెక్టర్‌ ముందస్తుగా ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలను చర్చించనున్నరు. ఇందిరమ్మ బాటలో అధికారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే జిల్లా పరిస్థితుల పై ముఖ్యమంత్రికి వివరించటానికి కలెక్టర్‌ సిద్ధార్ధ జైన్‌ హైదరాబాద్‌ వెళ్ళారు.