నేడు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ ,టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ తీరును నిరసిస్తూ కేసీఆర్‌ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పొలిటికల్‌ జేఏసీ, ఉద్యోగ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ బంద్‌ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 841 బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. షాద్‌నగర్‌ ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. ఖమ్మం బస్‌డిపో ఎదురుగా టీఆర్‌ఎస్‌, న్యూడెమోక్రసీ , జేఏసీ నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకోని నిరసన తెలుపుతున్నారు. సూర్యాపేట బస్సుడిపో ముందు టీఆర్‌ఎస్‌ , జేఏసీ నేతలు బైఠాయించారు. సూర్యపేట బస్సు డిపో పరిధిలో 705 బస్సులు నిలిచిపోయాయి. జూబ్లీబస్‌స్టేషన్‌లో బస్సులకు అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉపనేత  హరీష్‌రావుతో పాటు పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టుచేశారు.

నేడు ఓయూ పరీక్షలు వాయిదా

తెలంగాణ బంద్‌ కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే సరీక్షలన్నీ వాయిదా వేశారుజ తెలంగాణలోని విద్యాసంస్థలన్నింటిలో బంద్‌ పాటించాలని ఓయూ విద్యార్ధి విభాగం విజ్ఞప్తి చేసింది. టీఆర్‌ఎస్‌ . టీ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చినందుకున పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలన్నీ  మూతపడనున్నాయి. తెలంగాణ జిల్లాల్లో బస్సులు నడిచే అవకాశం లేదని , బంద్‌ను విజయవంతం చేయాలని టీఎంయూ విజ్ఞప్తి చేసింది.