నేడు ప్రధాని, సోనియాలతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం నేతలతో చర్చించనున్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ అగ్రనేతలు చిదంబరం, ఆంటోనీ, ఆజాద్‌తో భేటీ  అయ్యారు.