నేడు బిసి, ఎస్సీ కొర్పారేషన్ల యూనిట్ల మంజూరుకైన ఇంటర్వ్యూలు
కందుకూరు, జూలై 18 : గురువారం వివిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు బిసి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా వర్గాల ప్రజలకు సబ్సిడీపై యూనిట్ల మంజూరుకై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ ప్రత్యేకాధికారి రత్నకుమార్ బుధవారం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన 12 యూనిట్లు, బిసి కార్పొరేషన్‌కు చెందిన 16 యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఈ సందర్బంగా పోకూరు, శాఖవరం, వివిపాలెం పరిధిలోని బ్యాంకు మేనేజర్లు పాల్గొననున్నట్లు చెప్పారు. కావున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సకాలంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.